రామ్ చరణ్ కు గేమ్ ఛేంజింగ్ మూవీ
వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రజలకు 4 రోజుల ముందే సంక్రాంతి పండడ రాబోతోంది. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో ప్రెస్టిజీయస్ మూవీ గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తున్న ఆర్ సీ సినిమా విడుదలైతే ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్లన్నీ గేమ్ ఛేంజర్ రాక కోసం ముస్తాబైపోయాయి. థియేటర్ల ముందు రామ్ చరణ్ భారీ కటౌట్లు, పూల దండలు, జెండాలతో సిద్ధమైపోయాయి. సినిమాను ఎప్పుడెప్పుడూ చూస్తామా అని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలు రిజనబుుల్ గా పెంచుకోవడానికి రెండు ప్రభుత్వాలు ఓకే చెప్పాయి. అడ్వాన్స్ బుకింగ్ ల మోత నడుస్తోంది. సినిమాకు ఇప్పటికే పాజిటివ్ టాక్ నడుస్తుండడం..పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. గత రెండు నెలలుగా సోషల్ మీడియాను ఈ పాటలు షేక్ చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం అరుగు మీద సాంగ్ సోషల్ మీడియాలో మోత మోగుతోంది. రామ్ చరణ్ లుక్స్ తో సినిమాకు మరింత హైప్ పెరిగింది. శంకర్ కమ్ బ్యాక్ ఇస్తారని మరో ఒకే ఒక్కడు, భారతీయుడులాగా ఇది కూడా చరిత్రలో నిలిచిపోతుందని భావిస్తున్నారు. టికెట్ కు పెట్టే పైసలు పాటలకే సరిపోతాయని, ఇక స్టోరీకి, రామ్ చరణ్ యాక్టింగ్ కు వేల రూపాయలు పెట్టినా ఫర్వాలేదని సగటు మెగా ఫ్యాన్స్ సంతోషంతో ఉర్రూతలూగుతున్నారు.
రామ్ చరణ్ కు త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న చిత్రంతో కావడంతో పాన్ ఇండియా లెవల్లో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ నటన చూసిన ఉత్తరాది, ఇతర దక్షిణాది అభిమానులు ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్, పొలిటికల్ లీడర్ పాత్రల్లోని నట విశ్వరూపాన్ని చూసి మరోసారి కన్నుల పండువ చేసుకోనున్నారు. దాదాపు అన్ని ప్రధాన భాషల్లో విడుదల అవుతుండడంతో ఇండియా లెవల్లో రికార్డులు సాధించడం తథ్యం. అయితే రామ్ చరణ్ కు చైనా, జపాన్ వంటి దేశాల్లో ఫ్యాన్ బేస్ ఉండడంతో ఆ భాషల్లో కూడా రిలీజ్ చేస్తే బాగుండేది. నిర్మాత దిల్ రాజు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు కాబోలు.
2025 సంవత్సరంలో భారీ సినిమాతో రికార్డులకు తెర తీస్తున్న రామ్ చరణ్ కు గేమ్ ఛేంజర్ కలకాలం గుర్తుపెట్టుకునే సినిమా అవుతుందని చెప్పవచ్చు. ఆయన కెరీర్ కు గేమ్ ఛేంజింగ్ కూడా కావొచ్చు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా కీర్తిపొందిన రామ్ చరణ్ తన స్టార్ డమ్ ను డబుల్ చేసుకోబోతున్నాడని పక్కాగా చెప్పవచ్చు.
మరిన్ని సినిమా కబుర్ల కోసం MEGA UPDATES.COM వెబ్ సైట్ ను సందర్శించండి