సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్ నిర్ణయం!

ram charan shocking decition

Ram charan: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్ నిర్ణయం!

గేమ్ ఛేంజర్ సినిమా అలా విడుదలైందో లేదో కొందరు పనిగట్టుకుని నెగిటివ్ కామెంట్లు, రివ్యూలతో రెచ్చిపోయారు. సినిమా బాగున్నా కూడా ఇండియాలోనే ఏ సినిమాకు లేనంతగా నెగిటివిటీని ప్రచారం చేశారు. అయిన కూడా మెగా ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు సైతం సినిమాను బతికించారు. తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి ప్రస్తుతం నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాను దెబ్బకొట్టాలని కొందరు టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ కంకణం కట్టుకుని సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేశారు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు సినిమా బాగుంది చూడొచ్చు అని జెన్యూన్ గా చెబుతున్నా వీరి దుష్ప్రచారం ఆగలేదు. కామెంట్స్ పెట్టడమే కాదు సినిమా హెచ్ డీ ప్రింట్ ను లీక్ చేసి బస్సుల్లోనూ, కేబుల్ టీవీల్లోనూ సినిమాను వేసేశారు. వీరి క్రూరత్వం ఎంతలా ఉందంటే సినిమాను కోలుకోకుండా చేయాలని ఎన్నో దుర్మార్గపు పనులు చేశారు.

ఇంత జరుగుతున్నా సినీ ఇండస్ట్రీ పెద్దగా స్పందించలేదు. ఒకరో ఇద్దరో మాత్రమే స్పందించారు. ఇక దిల్ రాజు కూడా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. రామ్ చరణ్ అద్భుత నటనతో సినిమాను వన్ మ్యాన్ షోలా మార్చి ప్రతీ ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా చేశారు. అందరూ సినిమా బాగుందని తమ పిల్లలకు సైతం చూపిస్తున్నామని ప్రశంసించినా నిర్మాత దిల్ రాజు నెగిటివ్ టాక్ ను ఆపడానికి ఓ ప్రెస్ మీట్ సైతం పెట్టలేదు. గతంలో గుంటూరు కారం సినిమాకు ఇలాగే జరిగితే ఆ నిర్మాత ఓపెన్ గా బయటకు వచ్చి ఖండించాడు. దీంతో ఆ సినిమా వసూళ్లు కాస్త మెరుగుపడ్డాయి. అలాగే పుష్ప-1 లాంటి సినిమాకు సైతం తొలి రోజు ప్లాప్ టాకే వచ్చింది. దీంతో ఆ నిర్మాతలు భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మరి సినిమా బాగుందని అందరూ చూడాలని కోరారు. దీంతో నెగిటివిటీ కాస్త తగ్గి ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా ఎన్నో సినిమాలు నెగిటివ్ రివ్యూలు వచ్చినా ఆ తర్వాత కోలుకున్నాయి.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా వందల కోట్లు సాధించే స్టఫ్ ఉన్న సినిమానే. కానీ దీన్ని నిర్మాత, దర్శకులు ఎందుకో గాలికి వదిలేసినట్టు కనిపించింది. ఉదయం రిలీజ్ కాగానే నెగిటివ్ టాక్ రాగానే దాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టాల్సింది. దాంతో సినిమాపై నెగిటివ్ టాక్ పై పాజిటివ్ టాక్ నిలబడి సినిమా మరింత వసూళ్లు రాబట్టేది. సినిమాను పనిగట్టుకుని నెగిటివ్ చేస్తున్న వారిపై మూవీ టీమ్ తొందరగా కంప్లైంట్ చేస్తే బాగుండేది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టలేదు సరికదా..కనీసం ఒక్క ఇంటర్వ్యూ సైతం ఇవ్వలేదు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా హెవీ ప్రమోషన్ వల్ల సినిమా కలెక్షన్లు పుంజుకునేవి. కానీ నిర్మాత, దర్శకులు గాలికి వదిలేశారు. వెయ్యి కోట్ల దాక సంపాదించాల్సిన సినిమాను 300-400 కోట్లకే పరిమితం చేశారు. వాస్తవానికి ఈ సంక్రాంతి బరిలో నిలిచిన వాటిలో గేమ్ ఛేంజర్ తప్ప మిగతావి రోటిన్ సినిమాలే. గేమ్ ఛేంజర్ మాత్రమే పాన్ ఇండియాకు సరితూగే కథతో వచ్చింది. అయినా కూడా మూవీ టీం మంచి అవకాశాన్ని కాలరాసుకుంది.

ఇంత గేమ్ నడిచినా రామ్ చరణ్ తన హుందాతనాన్ని ఎక్కడా పోగొట్టుకోలేదు సరికదా ఆడియన్స్ మనస్సులో మరింత స్థానాన్ని ప్రోది చేసుకున్నాడు. గేమ్ ఛేంజర్ లో తన నటనతో ఫిదా అన్పించాడు. ఇంత నెగిటివిటీని స్ప్రెడ్ చేసిన యాంటీ ఫ్యాన్స్ రామ్ చరణ్ నటనలో రవ్వంత లోపాన్ని కనిపెట్టలేకపోయారు. సినిమా బాగాలేదు..శంకర్ డైరెక్షన్ కొత్తగా లేదన్నారు తప్ప రామ్ చరణ్ నటనకు సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ 100 మార్కులు వేశారు. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉంది. ఈ సినిమా డివైడ్ టాక్ ను స్ప్రెడ్ చేసినా రామ్ చరణ్ ఇమేజ్ కు సెంట్ పర్సెంట్ కూడా డ్యామేజ్ కాలేదనే చెప్పాలి. ఆయన ఇమేజ్ ఇంకా పెరిగిందనే చెప్పాలి.

గేమ్ ఛేంజర్ పరిస్థితికి స్వయంగా నిర్మాత, దర్శకులదే తప్పు అని చెప్పకతప్పదు. అయినా రామ్ చరణ్ వారిపట్ల హుందాగానే వ్యవహరించాడు. నిర్మాత దిల్ రాజు విషయంలో రామ్ చరణ్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో దిల్ రాజు పంట పండినట్టే అని టాలీవుడ్ వర్గాల్లో వార్త స్ప్రెడ్ అవుతోంది. గేమ్ ఛేంజర్ లాభాలు, నష్టాలతో పని లేకుండా దిల్ రాజుతో మరొక సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ సినిమాకు తనకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ అవసరం లేదని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా హిట్టు కొడితే లాభాల్లో కొంత వాటా ఇవ్వండని లేకుంటే నయాపైసా అవసరం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇది దిల్ రాజుకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మెగాస్టార్ కొడుకు అనిపించుకున్నాడని.. రామ్ చరణ్ మాటంటే మాటే అని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ మంచి మనస్సు తెలిసిన ప్రతీ ఒక్కరూ ఆయనంటే పడి చస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన తత్వాన్ని చూసి లక్షల్లో ఫ్యాన్స్ తయారవుతున్నారు. గతంలో పవన్ కు సైతం ఇలాగే హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత పెరిగిందో మనకు తెలిసిందే. వపన్ తెరపై కనపడితే చాలు అన్నట్టుగా ఫ్యాన్స్ ఉండేవారు. ప్లాప్ లు ఆయన ఇమేజ్ ను ఇసుమంతా తగ్గించలేదు సరికదా మరింత పెంచాయి. బాబాయ్ లాగానే రామ్ చరణ్ కు సైతం గేమ్ ఛేంజర్ డివైడ్ టాక్ ఫ్యాన్స్ ను పెంచిందే తప్ప తగ్గించలేదు.

ఇక రామ్ చరణ్ రాబోయే సినిమా గురుశిష్యులవి. మంచి కథబలం, మాస్ ఎలివేంట్స్ తో ఉండబోతున్నాయి. వాటి తర్వాతే దిల్ రాజు మూవీ ఉండబోతోంది. ఆ రెండు సినిమాలతో రామ్ చరణ్ ఇమేజ్ ఎవరెస్ట్ ను దాటేస్తుందనడంలో డౌటే లేదు.

మరిన్ని మెగా ఫ్యామిలీ వార్తలను Mega updates.com లో చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top