వీరమల్లు మాట వినాల్సిందే.. పాట వినాల్సిందే! ఇంతకీ పాట ఎలా ఉందంటే..
పవర్ స్టార్ మాటే కాదు పాట కూడా పవర్ ఫుల్లే. ఆయన క్రాప్ సవరించినా, డైలాగ్ కొట్టినా, చేతులతో మెడలను తాకినా, స్టైల్ గా నడిచినా, రాజకీయ సభల్లో వాడీవేడి డైలాగులతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పెట్టించినా అది ఒక్క పవన్ కే చెల్లింది. పవన్ నుంచి సినిమా రాక చాలా కాలమైంది. దీంతో ఫ్యాన్స్ ఇప్పటికే పిచ్చెక్కిపోతున్నారు. ఎక్కడికెళ్లినా సినిమా అప్ డేట్స్ ఎప్పుడంటూ హోరెత్తిస్తున్నారు. ఓజీ..ఓజీ అంటూ దుమ్ము దుమారం చేస్తున్నారు. మొన్నటికి మొన్న గేమ్ ఛేంజర్ ఈవెంట్లలో సైతం ఓజీ జపమే. అభిమానులను ఆపడం ఎవరి తరం కావడం లేదు. మెగాస్టార్ సభల్లోనూ, రామ్ చరణ్ ప్రెస్ మీట్లలోనూ, పవన్ రాజకీయ ప్రసంగాలు, ప్రెస్ మీట్లలోనూ..ఇలా ప్రతీ చోట ఓజీ సౌండింగే. ఒక్కోసారి పవన్ కే చిర్రెత్తుకొస్తుంది లెండి. అలా ఉంటంది పవన్ ఫ్యాన్స్ తోటి అని సోషల్ మీడియాలో ఒక్కటే హోరు.
మొత్తానికి మెగా పవర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే రోజు వచ్చింది. ఇవాళ హరిహర వీరమల్లు నుంచి పెద్ద గిఫ్ట్ అనుకోవాల్సిందే. వీరమల్లు నుంచి ‘మాట వినాల్సిందే’ పాట రిలీజ్ అయ్యింది. అయితే పాట రిలీజ్ కావడం ఒక్కటే సంతోషం కాదు. ఈ పాటను పవన్ పాడడం డబుల్ సంతోషాన్ని నింపింది. పవన్ ఇప్పటికే చాలా పాటలు పాడిన సంగతి తెలిసిందే. తమ్ముడు, ఖుషీ, జానీలాంటి చిత్రాల్లో పవన్ పాడిన బిట్ సాంగ్స్ అభిమానులను ఉరకలెత్తించాయి. తాజాగా రిలీజైన హరిహర వీరమల్లు మాట వినాల్సిందే పాట మరింత అద్దిరిపోయేలా ఉందని చెప్పడంలో ఎలాంటి డౌటే అక్కర్లేదు.
పాట రిలీజ్ అయ్యిందో లేదో.. కొద్ది సేపట్లోనే 9 మిలియన్ల పైచిలుకు వ్యూస్ ను సొంతం చేసుకుంది. మరి కొద్ది గంటల్లోనే రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే అవకాశం కనపడుతోంది. పవన్ కు ఇలాంటి పాటలు పాడడం కొత్త కాదు. గతంలో ఎన్నింటినో పాడి దుమ్మురేపాడు. ఇక ఈ పాట కూడా అద్భుతమే అని చెప్పాలి. పవన్ తన మార్క్ స్టైల్లో పాటను ఇరగదీశాడు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మాట వినాలి పాటను పెంచల్ దాసు రాశాడు. తెలంగాణ యాసలో సాగే ఈ పాట లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి. గతంలోనూ ‘‘నారాజు కాకురా మాఅన్నయ్య..’’ సాంగ్ ను తెలంగాణ స్లాంగ్ లో పాడగా సూపర్ హిట్ గా నిలిచింది.
నా మాట వినాలి..పాటను ఒక్కసారి గమనిస్తే..
ముందుగా పవన్ తెలంగాణ స్లాంగ్ డైలాగులతో పాటను ప్రారంభిస్తాడు.‘‘ఏమిరా గుల్ఫామ్..ఏం గురాయించి చూస్తున్నవ్..ఏం భయపెట్టనికా..నారాజు తిన్నవా..ఓహో చాలా మందిని చూసినం లే బేటా.. ఏం ముణిమాణిక్యం చూసినవా..గురాయించి చూస్తున్నడు బేటా..మన లెక్కలు తెల్వదు.. అహా.. వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి..అన్న సుబ్బన్న కొట్టన్న..’’ అంటూ డైలాగులతో పాట మొదలవుతుంది. మాట వినాలి గురుడా మాట వినాలి.. అంటూ సాగుతుంది.
మొత్తానికైతే ఈ పాట ఫ్యాన్స్ ను హుషారెత్తించనుంది. థియేటర్లలో విజిల్ వేయిస్తుంది. ఇక ఏ సందర్భమైనా మాట వినాలి.. అనేది ఓ పెద్ద ట్యాగ్ లైన్ అయిపోతుందనడంలో సందేహం లేదు. ఈ పాటలోని సన్నివేశాన్ని గమనిస్తే వీరమల్లు బ్యాచ్ రిలాక్స్ కావడానికి ఓ చోట కూర్చుండగా వస్తుందనిపిస్తుంది. ఈ పాటలో ఓ పాత్రకు నీతిబోధ చేసేలా కనపడుతోంది.
ఇక నుంచి పవన్ సినిమాల అప్ డేట్స్ తొందర తొందరగా వచ్చేట్లు కనపడుతోంది. ఒకే ఏడాదిలో పవన్ రెండు చిత్రాలను చూసే భాగ్యం ఫ్యాన్స్ కలుగబోతుందనే చెప్పాలి. ఇక ఇంకేముంది ఆలస్యం మీరు పాట వినండి మరి.
మరిన్ని సినిమా కబుర్ల కోసం MEGA UPDATES.COM వెబ్ సైట్ ను సందర్శించండి